Tuesday, 31 January 2017

1 ఫిబ్రవరి 2017

గృహంలో మార్పులు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో మెలకువ అవసరం. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.

Monday, 30 January 2017

31 జనవరి 2017

స్త్రీలకు ఎదుటివారి విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్ణయాలు, అభిప్రాయాలకు కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. పెద్దల ఆరోగ్యంలో మెలకువ అవసరం. అనుకోకుండా నిరుద్యోగుల యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సన్నిహితులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. విద్యార్థులకు ధ్యేయంపట్ల ఏకాగ్రత, స్థిరబుద్ధి నెలకొంటాయి.

30 జనవరి 2017

పై అధికారులు, ప్రముఖులతో వాగ్వివాదాలకు దిగకండి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఆశించినంత మేరకు అవకాశాలు లభిస్తాయి. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. శుభవార్తలు వింటారు.

Saturday, 28 January 2017

29 జనవరి 2017

ఆర్థి వ్యవహారాలలో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఉద్యోగస్తులకు స్థాన మార్పిడి, కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్ని సాధిస్తారు. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు.

Friday, 27 January 2017

28 జనవరి 2017

గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. అంతగా పరిచయం లేనివారికి ధన సహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా అందుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.

Thursday, 26 January 2017

27 జనవరి 2017

వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలకు చీటికి మాటికీ అసహనం, నిరుత్సాహం లాంటి చికాకులు తప్పవు. మీడియా రంగాల వారు పనిభారం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఆత్మీయులకు బహుమతులు అందిస్తారు.

Wednesday, 25 January 2017

26 జనవరి 2017

మీ దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరపుతారు. దైవ కార్యాలలో చురుకుగా వ్యవహరిస్తారు. రుణ విముక్తులు కావటంతో మానసికంగా కుదుటపడతారు. భాగస్వామిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి.

Tuesday, 24 January 2017

25 జనవరి 2017

వృత్తుల వారికి అన్నివిధాలా కలిసిరాగలదు. ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు ఎటువంటి ఉద్రేకాలకు లోనుకాకుండా ఏకాగ్రతతో వ్యవహరించటం అన్నివిధాలా క్షేమదాయకం. ఆహ్వానాలు అందుకుంటారు. ప్రేమికులకు మధ్య ఎడబాటు తప్పదు.

24/01/2017

ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించటంతో మీలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. స్థిరాస్థికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలను ఇవ్వవు. వృత్తి వ్యాపారస్తుల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.