స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. నియమాలకు కట్టుబడి ఉండుట వలన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వస్త్ర, బంగారం, వెండి రంగాల్లో వారికి అనుకూలమైన కాలం. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టినప్పుడు మెళకువ అవసరం.
Saturday, 25 February 2017
Thursday, 23 February 2017
24 ఫిబ్రవరి 2017
ఆర్థికంగా అభివృద్ధి కానవచ్చినా, మానసిక ప్రశాంతత ఉండజాలదు. దూరప్రయాణాలు, ద్విచక్రవాహన ప్రయాణం మంచిది కాదు. రాజకీయ నాయకులు తమ వాగ్ధానాలను నిలబెట్టుకోలేక పోవటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అవివాహిత యువకుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
Wednesday, 22 February 2017
23 ఫిబ్రవరి 2017
కాంట్రాక్టర్లు నాణ్యతాలోపం నిర్మాణాల వల్ల కష్టనష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు పని ఒత్తిడి, ఊహించని చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యార్థినులకు ఏకాగ్రతా లోపం, వ్యాపకాలు అధికం కావటంతో చికాకులకు లోనవుతారు. అపరిచిత వ్యక్తుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం ఉంది.
Tuesday, 21 February 2017
22 ఫిబ్రవరి 2017
స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. మీరు ఎదురుచూస్తున్న పత్రాలు చేతికందుతాయి. రాబడికి మించిన ఖర్చులుంటాయి. రుణయత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు.
Sunday, 19 February 2017
20 ఫిబ్రవరి 2017
ఉద్యోగస్తులకు స్థాన మార్పిడి అనుకూలిస్తుంది. మార్కెట్ రంగాల వారు తమ టార్గెట్లు సునాయాసంగా అధిగమిస్తారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. మీ వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వృత్తుల వారికి ఆశాజనకం. బాధ్యతలు అధికమవుతాయి.
Saturday, 18 February 2017
19 ఫిబ్రవరి 2017
పారిశ్రామిక రంగాల వారికి లైసెన్సులు, పర్మిట్లు సానుకూలమవుతాయి. నిరుద్యోగులు ఒక ప్రకటనపట్ల ఆకర్షితులవుతారు. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్తిరాస్థి క్రయవిక్రయాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
Friday, 17 February 2017
18 ఫిబ్రవరి 2017
గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ప్రైవేటు సంస్థల్లోని వారికి తోటి వారి కారణంగా సమస్యలు తలెత్తగలవు.
Thursday, 16 February 2017
17 ఫిబ్రవరి 2017
ఆర్థికస్థితి కొంత మెరుగుపడుతుంది. బంధువుల రాకపోకలు అధికం అవుతాయి. విందులు, వినోదాల్లో మితంగా వ్యవహరించండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. సన్నిహితుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు. షేర్లు సామాన్యం.
Wednesday, 15 February 2017
16 ఫిబ్రవరి 2017
వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. బంధువర్గాలలో సఖ్యత నెలకొంటుంది. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. చేపట్టిన పనులు పట్టుదలతో శ్రమించి పూర్తి చేస్తారు. స్త్రీల ప్రతిభకు, వాగ్ధాటికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసిన వ్యాఖ్యలు కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటాయి.
Tuesday, 14 February 2017
15 ఫిబ్రవరి 2017
ఊహించని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. స్త్రీలకు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు, కావలసిన సమాచారం అందుతుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. జాయింట్ వెంచర్లు, భాగస్వామిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
Monday, 13 February 2017
14 ఫిబ్రవరి 2017
ఆర్థికస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబీకుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. మీ విలువైన వస్తువులు సమయానికి కనిపించక పోవటంతో చికాకులకు గురవుతారు. దూరప్రయాణాలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి.
Sunday, 12 February 2017
13 ఫిబ్రవరి 2017
ఉన్నతస్థాయి అధికారులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. స్త్రీలకు పని ఒత్తిడి, విశ్రాంతి లోపం తప్పవు. ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి. గృహ మరమ్మత్తులు, మార్పులు అనుకూలిస్తాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమికుల మధ్య అవగాహనా లోపం ఏర్పడుతుంది.
Saturday, 11 February 2017
12 ఫిబ్రవరి 2017
గృహంలో సందడి కానవస్తుంది. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. ప్రింటింగ్ రంగాలలోనివారు అచ్చుతప్పులు పడుటవలన మాట పడాల్సి వస్తుంది. కుటుంబీకుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్ వచ్చేందుకు మరికొంత సమయం వేచి చూడాల్సి వస్తుంది.
Friday, 10 February 2017
11 ఫిబ్రవరి 2017
కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఉన్నత విద్య, పరిశోధనలు, చర్చలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కంపెనీలలో పనిచేయువారికి జాగ్రత్త అవసరం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సిమెంటు, ఇసుక, ఇటుక వ్యాపారస్తులకు కలసివస్తుంది. సొంతంగాకానీ, భాగస్వామ్యంగాగానీ చేసిన వ్యాపారాలు కలసివస్తాయి.
Thursday, 9 February 2017
10 ఫిబ్రవరి 2017
ఉద్యోగస్తులకు ఏకాగ్రతా లోపంవల్ల పై అధికారులతో సంభాషించేటప్పుడు మెలకువ అవసరం. నిర్మాణ పథకాల్లో చురుకుదనం కానవస్తుంది. ఖర్చులు అధికం. అయినా ధనం సమయానికి సమకూరటంవల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. చేతి వృత్తుల్లోని వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కుటుంబంలో ఇతరుల జోక్యం మీకు చికాకు కలిగిస్తుంది.
Wednesday, 8 February 2017
9 ఫిబ్రవరి 2017
స్త్రీలు అనవసర విషయాలలో జోక్యం చేసుకోవటంవల్ల భంగపాటుకు గురవుతారు. మీ యత్నాలకు ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి. దూర ప్రయాణాలు, ద్రవ్య చెల్లింపులలో మెలకువ వహించండి. కాంట్రాక్టర్లకు పనివారితో సమస్యలు తప్పవు.
Tuesday, 7 February 2017
8 ఫిబ్రవరి 2017
నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ విషయంలో ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీల పేరుతో ఆస్తి కొనుగోలు చోస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
Monday, 6 February 2017
7 ఫిబ్రవరి 2017
ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు అనవసర విషయాలలో జోక్యం చేసుకోవటంవల్ల భంగపాటుకు గురౌతారు. ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలోని వారికి సదవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు మధ్యవర్తులపట్ల అప్రమత్తత అవసరం.
Sunday, 5 February 2017
6 ఫిబ్రవరి 2017
ఆడిటర్లు మానసికంగా కుదుటపడతారు. కంపెనీలలో పనిచేయు వారికి జాగ్రత్త అవసరం. ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. విద్యా, సాంస్కృతిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. మీ యత్నాలకు ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు అందిస్తారు.
Saturday, 4 February 2017
5 ఫిబ్రవరి 2017
స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పీచు, ఫోమ్, లెదర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. విద్యార్థులకు ఆందోళన అధికం అవుతుంది. ఆహార వ్యవహారాలలో మెలకువ వహించండి. స్పెక్యులేషన్ చేయువారికి ఆశాజనకం. విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి. మీరు తొందరపడి సంభాషించటం వల్ల ఊహించని సమస్యలు తలెత్తగలవు.
Friday, 3 February 2017
4 ఫిబ్రవరి 2017
వృత్తి, వ్యాపారాలలో ఆలస్యంగా పురోగతి కనిపిస్తుంది. పొదుపు పథకాలు, చిన్నారుల విద్యా విషయాల గురించి కుటుంబ పెద్దలతో చర్చిస్తారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు.
Thursday, 2 February 2017
3 ఫిబ్రవరి 2017
ప్రైవేటు, రిప్రజెంటేటివ్‌ల సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలు వాయిదా పడతాయి. లీజు, ఏజెన్సీలు, మరి కొంతకాలం వేచి ఉండటం మంచిది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెలకువ అవసరం. ఆలయాలను సందర్శిస్తారు.
Wednesday, 1 February 2017
2 ఫిబ్రవరి 2017
స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగానీ చేపట్టిన పనులు పూర్తి కావు. వ్యాపారంలో పెరిగిన పోటీ వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి గురవుతారు. సంఘంలో మీ మాటను అందరూ గౌరవిస్తారు.
Subscribe to:
Comments (Atom)